121 అడుగుల పిల్లి బొమ్మ!

ABN , First Publish Date - 2020-10-22T07:56:55+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. 2 వేల ఏళ్ల క్రితం ఒక పర్వతంపై గీసిన భారీ పిల్లి బొమ్మ ఇది. పొడవు 121 అడుగులు! పెరూలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాజ్కా గీతలు ఉన్న ప్రాంతంలోనే ఈ బొమ్మను కూడా పరిశోధకులు గుర్తించారు...

121 అడుగుల పిల్లి బొమ్మ!

ఒకటి కాదు.. రెండు కాదు.. 2 వేల ఏళ్ల క్రితం ఒక పర్వతంపై గీసిన భారీ పిల్లి బొమ్మ ఇది. పొడవు 121 అడుగులు! పెరూలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాజ్కా గీతలు ఉన్న ప్రాంతంలోనే ఈ బొమ్మను కూడా పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పుల వల్ల చెరిగిపోయే స్థితికి చేరుకుందన్నారు. నాజ్కా గీతలను క్రీస్తుపూర్వం 200వ సంవత్సరంలో గీసినట్లు అంచనా. 1927లో వీటిని తొలిసారి గుర్తించారు. భూమిపై 174 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అంత భారీ గీతలు ఎందుకు, ఎలా గీశారన్నది మిస్టరీనే.

Updated Date - 2020-10-22T07:56:55+05:30 IST