Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 1 2021 @ 11:57AM

పరప్పన అగ్రహార జైలులో CCB దాడులు

బెంగళూరు: బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగృహంపై సీసీబీ పోలీసులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. జైలు నుంచే క్రిమినల్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొందరిని గుర్తించి వారిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సీసీబీ అధికారులు దాడి జరిపిన సమయం ఖైదీల బ్యారక్‌లలో గంజాయి పాకెట్లు లభించినట్లు తెలుస్తోంది. కొందరు జైలు నుంచే క్రిమినల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనడానికి సాక్ష్యంగా జైలులో మొబైల్‌ ఫోన్లు లభించినట్లు సమాచారం. క్రైం విభాగానికి చెందిన జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ నాయకత్వంలో ఇద్దరు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలు 15 మంది ఇన్‌స్పెక్టర్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు. జైలు సిబ్బంది సహకారం లేకుండా అక్రమాలు సాగేందుకు అవకాశం లేదని భావిస్తున్న సీసీబీ అధికారులు కొందరిని ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇవి రొటీన్‌ దాడులేనని అప్రమత్తం చేసేందుకు నిర్వహిస్తున్నామని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

Advertisement
Advertisement