108 వాహనంలోనే ప్రసవం....తల్లీబిడ్డ క్షేమం

ABN , First Publish Date - 2020-09-15T11:03:19+05:30 IST

అత్యవసర వైద్యసేవకు వారధిగా ఉండే 108 అంబులెన్స్‌ అంటే తెలియని వారుండరు. అలాంటి వాహన సిబ్బంది బాఽధితులను

108 వాహనంలోనే ప్రసవం....తల్లీబిడ్డ క్షేమం

  • సిబ్బంది స్పందనపై స్థానికుల అభినందన


కడప(సిటీ), సెప్టెంబరు 14: అత్యవసర వైద్యసేవకు వారధిగా ఉండే 108 అంబులెన్స్‌ అంటే తెలియని వారుండరు. అలాంటి వాహన సిబ్బంది బాఽధితులను వైద్యశాలలకు తర లి స్తూ విశిష్ట సేవలందిస్తుంటారు. ఒక్కోసారి విధులతో పాటు మానవ తా దృక్పథంతో కూడా సేవలందిస్తుంటారు. ముఖ్యంగా గర్భిణుల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. ఒక్కోసారి వారే ప్రసవం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సంఘటన సోమవారం కడప నగరంలో చోటు చేసుకుంది. గర్భిణీని 108 వాహనంలో తీసుకుని బయలుదేరాక మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికం కాగా వాహన సిబ్బంది స్పం దించి వైద్య సేవకులుగా మారి సుఖ ప్రసవం చేయించగలిగారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. కడప నగరం ఆర్‌కే నగర్‌లో ఎం.లక్ష్మిదేవి (25) భర్త, ఇద్దరు పిల్లలతో నివశిస్తోంది. ఆమె నిండు గర్భిణీ. భర్త పనికోసం బయటికి పోగా ఉదయం నొప్పులు వచ్చాయి. బంధువులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు.


వాహన పైలెట్‌ శేషగిరి, టెక్నీషియన్‌ సుబ్బారెడ్డి వచ్చి ఆమె బంధువుతో రిమ్స్‌కు బయలుదేరారు. వాహనం కేంద్ర కారాగారం వద్దకు రాగానే నొప్పులు  అధికమయ్యాయి. ప్రస వం జరగాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే టెక్నీషియన్‌ సుబ్బారెడ్డి వాహ నం ఆపి బంధువు సహకారంతో సుఖ ప్రసవమయ్యేలా సేవలందించారు. లక్ష్మీదేవి పండంటి మగబిడ్డ ప్రసవించింది. బిడ్డను లక్ష్మీదేవి బంధువుకు అప్పగించారు. సిబ్బంది స్పందన, చొరవ పట్ల బంఽధువులు, స్థానికులు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం తల్లిబిడ్డను రిమ్స్‌కు తరలించారు.

Updated Date - 2020-09-15T11:03:19+05:30 IST