Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులను మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

మునగాల రూరల్‌, డిసెంబరు 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  జూలకంటి రంగారెడ్డి అన్నారు. మునగాల మండలం  కొక్కిరేణి గ్రామంలో బుధవారం నిర్వహించిన సీపీఎం 8వ మండల మహాసభలో ఆయన  మాట్లాడారు. రైతులు చేసిన మహా ఉద్యమంతో నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుందన్నారు. వరికి ప్రత్యా మ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు ఆదేశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏ విత్తనాలు ఏవిధంగా కొనుగోలు చేయాలో, ఏ పంటలు సాగు చేయాలో చెప్ప కుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రజాసమస్యలపై సీపీఎం పోరాడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వర్లు, ముల్కలపల్లి రాములు, నందిగామ సైదులు, దేవరం వెంకట్‌రెడ్డి, చందా చంద్రయ్య పాల్గొన్నారు. Advertisement
Advertisement