హైదరాబాద్‌లో చైన్ స్నాచర్‌కు దేహశుద్ది
ABN , First Publish Date - 2021-01-13T21:11:10+05:30 IST
బేగంబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో బైక్, చైన్ స్నాచర్‌కు స్థానికులు దేహశుద్ది చేశారు. గాంధీభవన్ పటేల్‌నగర్‌లో పోలీసులు
హైదరాబాద్: బేగంబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో బైక్, చైన్ స్నాచర్‌కు స్థానికులు దేహశుద్ది చేశారు. గాంధీభవన్ పటేల్‌నగర్‌లో పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తుండగా దొంగిలించిన బైక్‌తో యువకుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే పోలీసుల చేతి కొరికి పారిపోతుండగా పక్కనే ఉన్న గాంధీభవన్ పటేల్‌నగర్ బస్తీలో స్థానికులు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ది చేసి బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. స్నాచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.