మధురైలో రెచ్చిపోయిన చెయిన్ స్నాచర్

ABN , First Publish Date - 2020-08-04T22:23:12+05:30 IST

65 ఏళ్ల ఓ వృద్ధురాలి నుంచి చెయిన్ స్నాచర్ బంగారు గొలుసును అసహరించాడు.

మధురైలో రెచ్చిపోయిన చెయిన్ స్నాచర్

మధురై: 65 ఏళ్ల ఓ వృద్ధురాలి నుంచి చెయిన్ స్నాచర్ బంగారు గొలుసును అపహరించాడు. తిరిగి ఆ వృద్దురాలిపై దాడి చేశాడు. సైకిల్‌పై వచ్చిన గొలుసు దొంగ చైన్ అపహరించేందుకు చేసిన ప్రయత్నాలను వృద్ధురాలు పలుమార్లు అడ్డుకుంది. ఒక పక్క కేకలు పెడుతూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. అయినా ఆ దుండగుడు వదల్లేదు. వెంటపడి వచ్చి చైన్ లాక్కుని పారిపోయాడు. మధురై తూర్పువేలువీధిలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-08-04T22:23:12+05:30 IST