Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతనొక్కడే!.. ధూమ్ స్టైల్‌లో దొంగతనాలు.. డాక్టర్ గర్లఫ్రెండ్‌తో హైఫై లైఫ్.. చివరికి

అతనొక చైన్ స్నాచింగ్ దొంగ.  స్పోర్ట్స్ బైక్ మీద రై.. రై అంటూ స్పీడుగా వచ్చి తలకు తుపాకీ గురిపెట్టి రోడ్డు మీద వెళ్లేవారి మెడలో నుంచి బంగారు గొలుసులు, విలువైన బంగారు నగలు కాజేసేవాడు. ఒక్కడే దేశ రాజధాని ఢిల్లీలో రోజుకు 6 నుంచి 10 దొంగతనాలు చేస్తూ కలకలం రేపాడు.  


ఆ దొంగతనం సొమ్ముని విలాసాలకు ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో భార్యని ఉన్నా.. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో జల్సా చేసేవాడు. తన గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఒకరు డాక్టర్. నెలకు లక్ష నుంచి 1.5 లక్ష ఖర్చు చేసేవాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని షాలిమార్ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఆదిల్ మాలిక్(27)కు విలాసవంతంగా జీవితం గడపడం అంటే ఇష్టం. అతడు బాడీబిల్టింగ్ చేసేందుకు పెద్ద పెద్ద జిమ్‌లకు వెళ్లేవాడు. ఇంట్లో భార్యకు ఖరీదైన కానుకలు ఇచ్చేవాడు. బయట ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఖరీదైన హోటళ్లలో పార్టీలు, విందులకు వెళ్లేవాడు. ఇదంతా చేసేందుకు డబ్బు కోసం ఆదిల్ దొంగతనాలు చేసేవాడు. ఒక్కడే స్పోర్ట్స్ బైక్‌పై వెళ్లి తన వద్దనున్న తుపాకీ రోడ్డు మీద వెళ్లేవారిని బెదిరించి వారి వద్దనున్న మొబైల్ ఫోన్స్, బంగారపు నగలు కొట్టేసేవాడు. పోలీసుల గత మూడు నెలల్లో 100కు పైగా చైన్ స్నాచింగ్ ఫిర్యాదులు అందడంతో వాళ్లు ఈ కేసుని సీరియస్‌గా టేకప్ చేశారు. ఆదిల్‌ సోదరుడు అద్నాన్ కూడా చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసేవాడు. పోలీసుల చేతికి మందుగా.. అద్నాన్ చిక్కడంతో ఆదిల్‌ గురించి వారు తెలుసుకున్నారు. 

రోజూలాగే ఆదిల్ తన స్పోర్ట్స్ బైక్‌పై ఇంటి నుంచి తన డ్యూటీ(దొంగతనం)కి బయలుదేరాడు. కానీ అక్కడ పోలీసులు మఫ్టీలో అతనికోసం కాచుకొని ఉన్నారు. రోడ్డుమీద ఆదిల్ ఒక వ్యక్తిని తుపాకీతో బెదిరించి దోచుకోబోగా.. పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆదిల్ వద్ద నుంచి భారీ మొత్తంలో మొబైళ్లు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement