Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాణక్య నీతి: అన్నింటా ఫెయిలయినవారు మీకు ఎలా ఉపయోగపడతారంటే.. ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే జీవితం పూలబాట..

అనుభవంతో మీరు జీవితంలో నేర్చుకోగలిగే విద్యను మరెవరూ అందించలేరని అంటారు. అయితే తెలివైన వ్యక్తి ఇతరుల అనుభవాల నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి అన్ని సమస్యల నుండి తనను తాను కాపాడుకోగలుగుతాడు. ఎవరైనా జీవితంలో విజయం సాధించాలనుకుంటే, ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆచరించాలి. చాణక్య నీతిలో విజయం గురించి ఆచార్య చాలా నిగూఢమైన రహస్యాలు తెలియజేశారు. 


వాటిని మనం జీవితంలో అమలు చేయగలిగితే సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆచార్య చాణక్య చెప్పిన ఈ మూడు కీలక విజయ సూత్రాలను తెలుసుకోండి. వీటిని జీవితంలో ఆచరించడం ద్వారా ఎప్పటికీ అపజయం అనేదే ఎదురుకాదు. 

ఓడిపోయిన వ్యక్తి చెప్పే అనుభవాలను ఇతరులు తప్పక వినాలని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. అతను ఓటమికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు చెప్పగలుగుతాడు. మీరు అతని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగితే, మీరు అలాంటి సవాళ్లు ఎదురైనపుడు వాటిని సులభంగా అధిగమిస్తారు. అందుకే ఎవరినీ నిరుపయోగమైనవారిగా భావించవద్దు. జీవితంలో ఓటమి పాలయిన వ్యక్తి.. ఖచ్చితంగా మీకు గెలుపు మార్గాన్ని చూపిస్తాడు.

విజయపథంలో నడుస్తున్నవారి అనుభవాలను కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ కోవలోకి వచ్చేవారి అనుభవాలు వింటే మీ ఆత్మవిశ్వాసం రెండింతలవుతుంది. అలాంటి వ్యక్తులు మీకు స్ఫూర్తిగా నిలుస్తారు. మీరు జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటే, అంతర్గతంగా అంటే మానసికంగా ఉత్సాహంగా ఉండటం ఎంతో ముఖ్యం. అందుకే విజయం సాధించిన వ్యక్తుల కథలను, వారి జీవిత  పోరాటాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. విజయాన్ని అందుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

మనిషికి భావోద్వేగాలే గొప్ప బలం. మీరు ఎటువంటి ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకున్నా మీలో సానుకూల ఆలోచనలు ఏర్పడాలి. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. జీవితంలో చాలాసార్లు ఓటమి ఎదురవుతుంది. మనం చేసే పనుల ఫలితాలు సానుకూలంగా ఉండవు. అలాంటప్పుడు మీకు ఎదురైన పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకోండి. వాటి ద్వారా ముందుకు సాగండి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement