Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా చిన్నారులందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మనం మన వర్తమానాన్ని త్యాగం చేసినట్లయితే, మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు... అలాంటిది ఈరోజు ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల కోసం విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘భారత యాత్ర’ చేపట్టిన కైలాశ్‌ సత్యార్థితో పాటు... నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీధుల్లో పాదయాత్ర చేసాను. ఇప్పుడు కూడా అవసరమైతే పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ రోడ్డు మీదకు వస్తాను. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు బాలలే. వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మనదే. జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా పిల్లల హక్కుల పరిరక్షణకు, లైంగిక దాడుల నుంచి వారిని కాపాడేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేసేందుకు ప్రతిన తీసుకుందాం’’అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement