Chennai: రామేశ్వరం జాలర్లపై లంక నావికాదళం దాడి

ABN , First Publish Date - 2021-07-19T18:05:12+05:30 IST

కచ్చాతీవు వద్ద ఆదివారం వేకువ జామున చేపలవేటకు వెళ్లిన రామేశ్వరం జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడి చేసింది. ఈ దాడిలో 30 పడవలు ధ్వంసం కాగా, సముద్రంలో వేసిన వలలను తెగగొట్టారు. రెండు రోజుల క్రితం రామేశ్వరం ప్రాంతానికి చెందిన

Chennai: రామేశ్వరం జాలర్లపై లంక నావికాదళం దాడి

30 పడవలు, వలలు ధ్వంసం

చెన్నై: కచ్చాతీవు వద్ద ఆదివారం వేకువ జామున చేపలవేటకు వెళ్లిన రామేశ్వరం జాలర్లపై శ్రీలంక నావికాదళం  దాడి చేసింది. ఈ దాడిలో 30 పడవలు ధ్వంసం కాగా, సముద్రంలో వేసిన వలలను తెగగొట్టారు. రెండు రోజుల క్రితం రామేశ్వరం ప్రాంతానికి చెందిన సమారు రెండు వేలమంది జాలర్లు 300 పడవల్లో సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. ఆదివారం వేకువజామున  వాటర్‌ బైకుల వచ్చిన శ్రీలంక నావికాదళం జాలర్లపై దాడిచేసి వలలన్నింటిని కోసారు.  30 పడవలను ధ్వంసం చేశారు. భీతిల్లిన జాలర్లు ప్రాణభయంతో తిరుగు ముఖం పట్టారు. ఈ దాడిలో సుమారు లక్ష విలువచేసే వలలు, చేపలు పట్టే పరికరాలు దెబ్బతిన్నాయని జాలర్లు తెలిపారు.  

Updated Date - 2021-07-19T18:05:12+05:30 IST