ఏపీ అసెంబ్లీ చరిత్రలో దుర్దినం

ABN , First Publish Date - 2021-11-20T14:07:56+05:30 IST

ఏపీ అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా వుందని, అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు దుర్ధినంగా మిగిలిపోతుందని చెన్నై టీడీపీ ఇన్‌చార్జ్‌ చంద్ర

ఏపీ అసెంబ్లీ చరిత్రలో దుర్దినం

                        - టీడీపీ నేత చంద్రశేఖర్‌


చెన్నై: ఏపీ అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా వుందని, అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు దుర్ధినంగా మిగిలిపోతుందని చెన్నై టీడీపీ ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల తీరుకు తీవ్ర నిరసన తెలిపిన చంద్రశేఖర్‌ విలేఖరులతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన వైసీపీ నేతలకు వత్తాసుపలుకుతున్న ముఖ్యమంత్రి జగన్‌ పతనం త్వరలోనే వుందని మండిపడ్డారు. ఆంధ్రుల ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్‌ కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిని అవమానిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడ్డం దారుణమన్నారు. ఇది యావత్‌ మహిళాజాతికి జరిగిన అవమానమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి భాష వాడుతున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని, వారి వ్యవహారశైలిని చూసి ఈసడించుకుంటోందన్నారు. ఇప్పటికే ఎన్నోమార్లు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అవమానాలకు గురి చేసిందని, ఇప్పుడు వ్యక్తిగతంగా, అతి నీచంగా చంద్రబాబు కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించిందన్నారు. 2024 లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని చంద్రశేఖర్‌  పేర్కొన్నారు.

Updated Date - 2021-11-20T14:07:56+05:30 IST