మైనర్ కుమారుడికి సున్తీ చేయించి ఇస్లాం మతంలోకి మార్చారు...

ABN , First Publish Date - 2022-01-13T13:53:01+05:30 IST

తన మైనర్ కుమారుడిని భార్య, అత్తమామలు ఇస్లాం మతంలోకి మార్చారని సాక్షాత్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన...

మైనర్ కుమారుడికి సున్తీ చేయించి ఇస్లాం మతంలోకి మార్చారు...

భార్య, అత్తమామలపై భర్త ఫిర్యాదు 

రాయ్‌పూర్: తన మైనర్ కుమారుడిని భార్య, అత్తమామలు ఇస్లాం మతంలోకి మార్చారని సాక్షాత్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. తన భార్య, అత్తమామలే తన మైనర్ కొడుకుకు సున్తీ చేయించి, అనుమతి లేకుండా బిడ్డను ఇస్లాం మతంలోకి మార్చారని భర్త ఆరోపించారు.హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి 10 సంవత్సరాల క్రితం ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. 8 సంవత్సరాల కుమారుడు,6 సంవత్సరాల కుమార్తె ఉన్నారని జష్పూర్ పోలీసు సూపరింటెండెంట్ విజయ్ అగర్వాల్ తెలిపారు. ఈ వ్యవహారంపై సన్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


‘‘మేం బుధవారం ఫిర్యాదుదారుని భార్య, అత్తగారిని అరెస్టు చేశాం, తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని ఎస్పీ చెప్పారు.నిందితులపై సెక్షన్లు 295-ఎ,  324, 34 లకింద కేసు నమోదు చేసినట్లు అగర్వాల్ తెలిపారు. ఫిర్యాదుదారు ముస్లిం మహిళను 10 సంవత్సరాల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.నవంబర్‌లో అతని భార్య తమ కొడుకును అస్తా సర్దిహ్ గ్రామంలోని తన తల్లి ఇంటికి తీసుకువెళ్లిందని, ఆపై భర్తకు సమాచారం ఇవ్వకుండా బిడ్డకు సున్తీ చేయించి,ఇస్లాంలోకి మార్చారని, తనను కూడా మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని భర్త పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 


Updated Date - 2022-01-13T13:53:01+05:30 IST