చీఫ్ జస్టిస్ నోట వివేకానంద సందేశం...

ABN , First Publish Date - 2021-09-12T22:32:10+05:30 IST

1893లో స్వామి వివేకానంద ప్రపంచానికి అందించిన సందేశం ఇప్పటికీ ఆలకించదగినదేనా? ఒక శతాబ్దం గడిచిపోయాక కూడా ఆయన మాటలు మనకు ఆచరణీయమేనా? ఖచ్చితంగా, స్వామీజీ పలుకులు... మనకు అవసరమే అంటున్నారు భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.

చీఫ్ జస్టిస్ నోట వివేకానంద సందేశం...

1893లో స్వామి వివేకానంద ప్రపంచానికి అందించిన సందేశం ఇప్పటికీ ఆలకించదగినదేనా? ఒక శతాబ్దం గడిచిపోయాక కూడా ఆయన మాటలు మనకు ఆచరణీయమేనా? ఖచ్చితంగా, స్వామీజీ పలుకులు... మనకు అవసరమే అంటున్నారు భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. హైద్రాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ఉన్న ‘వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్’ శాఖ 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణ పై విధంగా స్పందించారు. కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా పాల్గొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చారిత్రాత్మక చికాగో ప్రసంగాన్ని కూడా ప్రస్తావించారు. 

అమెరికాలో స్వామి వివేకానంద తొలిసారి ఉపన్యసించి సెస్టెంబర్ 11, 2021తో 125 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, అప్పట్లోనే స్వామీజీ భారతదేశ భవిష్యత్తును దర్శించగలిగారని ఎన్వీ రమణ అన్నారు. స్వాతంత్రోద్యమంలో మనం చెల్లించుకున్న భారీ మూల్యాల్ని వివేకానంద తాను జీవించి ఉండగానే ఊహించారని ఆయన అన్నారు. అందుకే, ఆయన  మూఢనమ్మకాలకి, ఛాందసత్వాలకి అతీతంగా మతం ఉండాలని నొక్కి చెప్పారంటూ చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. ఇప్పటికీ స్వామీజీ సందేశం మనకు శిరోధార్యమేనన్నారు. 

దేశ యువతని కూడా సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా తమ ప్రసంగంలో ప్రస్తావించారు. డిజిటల్ యుగంలో సమాచారం మొత్తం చేతి వేళ్ల అంచుల వద్దకి వచ్చేసిందన్న ఆయన యువతీయవకులు బాగా చదవాలని, ‌సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత చేసే ప్రతీ పని దేశ నిర్మాణంలో భాగమని కూడా చీఫ్ జస్టిస్ అన్నారు.       

Updated Date - 2021-09-12T22:32:10+05:30 IST