రూ.7లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-14T06:05:52+05:30 IST

చిలకలూరిపేట పట్టణంలో వరుసగా రెండోరోజు ఆదివారం నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల నిల్వల స్థావరాలపై చిలకలూరిపేట అర్బన్‌ సీఐ బిలాలుద్దీన్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు అజయ్‌బాబు, సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు.

రూ.7లక్షల విలువైన గుట్కా స్వాధీనం
నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల నిల్వలు పరిశీలిస్తున్న ఎస్‌ఐ అజయ్‌బాబు

చిలకలూరిపేట టౌన్‌, జూన్‌ 13: చిలకలూరిపేట పట్టణంలో వరుసగా రెండోరోజు ఆదివారం నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల నిల్వల స్థావరాలపై చిలకలూరిపేట అర్బన్‌ సీఐ బిలాలుద్దీన్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు అజయ్‌బాబు, సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు. మద్దిమల్లయ్యవీధి, గుండయ్యతోట, సుబ్బయ్యతోట, గాంధీపేట ప్రాంతాలలోని గోడౌన్‌లలో తనిఖీలు చేసి రూ.7లక్షల 20వేల విలువైన నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-06-14T06:05:52+05:30 IST