ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు కట్: China నిర్ణయం

ABN , First Publish Date - 2021-10-30T01:56:40+05:30 IST

అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది

ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు కట్: China నిర్ణయం

బీజింగ్: అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చితో ముగిసే శీతాకాలంలో వచ్చిపోయే అంతర్జాతీయ విమానాలను వారానికి 408కి కుదించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా  (సీఏఏసీ) ప్రకటించింది. కాగా, వేసవిలో ఈ విమానాల సంఖ్య 644గా ఉంది.


కరోనా మహమ్మారి రాజ్యమేలిన గతేడాది కంటే ఇది 21.1 శాతం తగ్గడం గమనార్హం. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


కాగా, దేశంలోని పలు ప్రావిన్సులలో చెదరుమదురుగా కరోనా కేసులు నమోదవుతుండడంతో అప్రమత్తమైన చైనా పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-10-30T01:56:40+05:30 IST