వైరస్‌ తెగులుతో ఎండుతున్న చీనీ చెట్లు

ABN , First Publish Date - 2021-05-10T06:08:05+05:30 IST

మండలంలోని చీనీ పం టలకు వింత వైరస్‌ తెగు లు సోకుతోంది. దీంతో వందలాది చెట్లు ఎండి పోతున్నాయి,

వైరస్‌ తెగులుతో ఎండుతున్న చీనీ చెట్లు
తెగులు సోకి ఎండిన చీనీ చెట్టు

ఆర్థికంగా నష్టపోతున్న ఉద్యాన రైతులు

విడపనకల్లు, మే 9: మండలంలోని చీనీ పం టలకు వింత వైరస్‌ తెగు లు సోకుతోంది. దీంతో వందలాది చెట్లు ఎండి పోతున్నాయి, రైతులు ల క్షలాది రూపాయలు నష్ట పోతున్నారు. మండలంలో ని పలు గ్రామాల్లో రైతు లు చీనీ పంటను సాగు చేశారు. వేల్పుమడుగు గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి ఐదెకరాల్లో చీ నీ తోటను సాగు చేశాడు. రెండు పంటలు తీసుకున్న తరువాత చెట్లకు వైరస్‌ తెగులు సోకటంతో చెట్లు మొత్తం ఎండి పోయాయి. దీంతో చేసేది లేక చెట్లను తొలగించి జామ పంటను సాగు చేశాడు. విడపనకల్లుకు చెందిన విజయ్‌శెట్టి 13 ఎకరాల్లో 1,800  చీనీ చె ట్లను సాగు చేశాడు. వింత వైరస్‌ సోకటంతో ఒక్కొక్క చెట్టు ఎండి పోతోంది. ఎండిన చె ట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నాడు. ఇప్పటికే 800 చెట్లు పూ ర్తిగా ఎండి పోయాయి. ప్రస్తుతం చీనీ తోటలో పంట మంచి కాపు దశలోఉంది. ప్రతీ చె ట్టుకు కాయలు కూడా విరగ్గాశాయి. ఓవైపు నీటి తడులు ఇస్తున్నా చెట్లు ఎండిపోతూ ఉండటంతో రైతు లబోదిబోమంటున్నాడు. ఆకులు ముడతలు పడటం, కాపు వచ్చి కా యలు కాసిన పచ్చని చెట్లు ఎండి పోవటం జరుగుతోంది. 800 చెట్లు ఒక్కసారిగా ఎండి పోవటంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం చీనీకి మార్కెట్‌లో మం చి ధర పలుకుతోందని, పంటలు చేతికి వచ్చే సమయంలో చెట్లు ఎండి పోతుండటంతో రైతులకు అంతు చిక్కటం లేదు. ఈ వైరస్‌ నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా చెట్లు మాత్రం నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హార్టికల్చర్‌  అధికారులు స్పందించి చీనీ తోటలు సాగు చేస్తున్న  రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-05-10T06:08:05+05:30 IST