చింతూరు అడవుల్లో బూబి ట్రాప్స్‌

ABN , First Publish Date - 2021-10-09T07:04:10+05:30 IST

చింతూరు, అక్టోబరు 8: భారీ విధ్వంసానికి వ్యూహం రచించిన మావోయిస్టుల కుట్ర ను పోలీసులు భగ్నం చేశారు. చింతూరు అడవుల్లో మావోయిస్టులు బూబి ట్రాప్స్‌ అమ ర్చడం గమనార్హం. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు పది ప్రదేశాల్లో అమర్చిన బూబి ట్రాప్స్‌ని కనుగొన్న పోలీసులు వాటిని వెలికితీశారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దునున్న చింతూరు మండలం మల్లెంపేటలో ఇవి శుక్రవారం వెలుగులోకి వచ్చాయి.

చింతూరు అడవుల్లో బూబి ట్రాప్స్‌
మావోయిస్టులు అమర్చిన బూబి ట్రాప్స్‌

పోలీసులే లక్ష్యంగా అమర్చిన మావోయిస్టులు... వెలికితీత

చింతూరు, అక్టోబరు 8: భారీ విధ్వంసానికి వ్యూహం రచించిన మావోయిస్టుల కుట్ర ను పోలీసులు భగ్నం చేశారు. చింతూరు అడవుల్లో మావోయిస్టులు బూబి ట్రాప్స్‌ అమ ర్చడం గమనార్హం. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు పది ప్రదేశాల్లో అమర్చిన బూబి ట్రాప్స్‌ని కనుగొన్న పోలీసులు వాటిని వెలికితీశారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దునున్న చింతూరు మండలం మల్లెంపేటలో ఇవి శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఏరియా డామినేషన్‌లో  భాగంగా చింతూరు, ఎటపాక సీఐల నేతృత్వంలో యాంటీ నక్సల్స్‌ స్వ్కాడ్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేపట్టిన కూంబింగులో బూబి ట్రాప్‌లను గుర్తించారు. వెదురు బొంగులను బాణాల మాదిరిగా చెక్కి వాటిని పది అడుగుల గోతుల్లో మావోయిస్టులు అమర్చారు. అవి కనిపించకుండా ఆ గోతుల పైభాగం మట్టి, ఆకులు కప్పి ఉంచారు.  అటు వెళ్లే భద్ర తా బలగాలు వాటిని గుర్తించక ఆ గోతుల్లో అడుగువేసిన మరుక్షణమే గాయపడేవిధంగా మావోయిస్టులు వ్యూహం రచించారు. ఇప్పటివరకు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌ అడవుల్లో బూబి ట్రాప్స్‌ అమర్చడం తెల్సిందే. ఇప్పుడు చింతూరు అడవుల్లో ఈ తరహా విధ్వంసానికి తెరలేపారు. కూంబింగుకు వెళ్లిన భద్రతా బలగాలు బూబి ట్రాప్స్‌లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన సందర్భాల్లో అప్పటికే అక్కడ కాచుక్కూర్చున్న మావోయిస్టులు భద్రతా బల గాలపై కాల్పులు జరుపుతారు. భద్రతా బలగాలు బూబి ట్రాప్స్‌లో చిక్కుకుని ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతారో అదే అదనుగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు తెగబడ తారు. ఇటువంటి ఘటనలు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పలుమార్లు జరుగుతూ ఉంటాయి.

Updated Date - 2021-10-09T07:04:10+05:30 IST