Abn logo
Aug 15 2021 @ 11:10AM

జెండాను ఎగురవేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత...అడ్డుకున్న పోలీసులు

చిత్తూరు: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలోని వక్ఫ్ స్థలంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాడానికి వచ్చిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను పోలీసులు అడ్డుకున్నారు. జెండా ఎగురవేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. దీనిపై షాజహాన్ బాషా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్వాతంత్ర్యం కూడా తమకు లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకుల అడుగులకు పోలీసులు మడుగులొత్తుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.