Abn logo
Aug 26 2021 @ 16:08PM

చిత్తూరు జిల్లా: బ్యాంక్ ఆఫ్ బరోడా స్కాం

చిత్తూరు జిల్లా: కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాదారులను నిండా ముంచింది. సంఘమిత్ర, బ్యాంక్ అధికారులు కుమ్మక్కయి ఖాతాదారుల నగదు రూ.3 కోట్లు మాయం చేశారు. డ్వాక్రా సంఘాల నిధులు గోల్‌మాల్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్ ఖాతాల్లోని రూ. 3కోట్ల నగదును మాయం చేశారు. రుణాల మంజూరులో సంఘమిత్ర, బ్యాంక్ అధికారులు కుమ్మక్కయి ఈ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. 


స్కాంలో ప్రధాన నిందితుడు బ్యాంక్ మేనేజర్ వెంకట మద్దిలేటితోపాటు ఐదుగురు సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఖాతాదారుల స్టేట్‌మెంట్, మెసేజ్‌లు ఏడాది నుంచి బ్యాంక్ అధికారులు ఇవ్వలేదని దర్యాప్తులో తేలింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ. 3 కోట్ల నిధులు గోల్‌మాల్ జరిగినట్లు తేలడంతో ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకుంటున్నారు. 150 మంది పొదుపు సంఘాలకు సంబంధించిన నగదు గల్లంతయ్యింది. బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ అలీఖాన్‌ తన భార్య పేరుతో ఉన్న ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు మళ్లించినట్టు వెల్లడైంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.