సినీ దర్శకుడు శ్రీవాస్‌కు మాతృవియోగం

ABN , First Publish Date - 2020-02-23T06:35:45+05:30 IST

ప్రముఖ సినీ దర్శకుడు శ్రీవాస్‌కు మాతృవియోగం కలిగింది. శ్రీవాస్‌ తల్లి ఓలేటి అమ్మాజీ(63) శనివారం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సినీ దర్శకుడు శ్రీవాస్‌కు మాతృవియోగం

సీతానగరం, ఫిబ్రవరి 22: ప్రముఖ సినీ దర్శకుడు శ్రీవాస్‌కు మాతృవియోగం కలిగింది. శ్రీవాస్‌ తల్లి ఓలేటి అమ్మాజీ(63) శనివారం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా రు. శ్రీవాస్‌ తండ్రి గాంధీ కొన్నేళ్లపాటు సీతానగరంలో రామదుర్గా సినిమాహాల్‌ నిర్వహించారు. వారికి శ్రీవాస్‌ ద్వితీయ కుమారుడు. లక్ష్యం, లౌక్యం, సాక్ష్యం తదితర హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం డీవీవీ దాన య్య కుమారుడు కల్యాణ్‌ను హీరోగా పరిచ యం చేస్తూ నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకత్వ బాధ్యలు చేపట్టారు. కాగా శ్రీవాస్‌కు సోదరుడు సుబ్రహ్మణ్యం, సోదరి వరలక్ష్మి. అమ్మాజీ మరణంతో స్వగ్రామం పురుషోత్తపట్నంలో వి షాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్య క్రియలు అక్కడే నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-02-23T06:35:45+05:30 IST