కృష్ణపట్నం పోర్టులో కార్మికుల తొలగింపుపై సీఐటీయూ నిరసన

ABN , First Publish Date - 2021-01-21T05:12:37+05:30 IST

కృష్టపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఫార్మాసిటీలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

కృష్ణపట్నం పోర్టులో కార్మికుల తొలగింపుపై సీఐటీయూ నిరసన
నిరసన తెలుపుతున్న సిటూ కార్యకర్తలు

పరవాడ, జనవరి 20: కృష్టపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఫార్మాసిటీలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తొలగించిన 500 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను యాజమాన్యం బానిసల్లా చూస్తోందని, రోజుకి 12 గంటలు పనిచేయించుకుని 8 గంటల వేతనమే ఇస్తోందన్నారు. పోర్టులో కార్మికచట్టాలు అమలు కావవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిటూ నేతలు కె.నాయుడు, కె.కృష్ణ, పి.చిన్నారావు, కనకారావు, రాజు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-21T05:12:37+05:30 IST