సుప్రీంకోర్టులో త్వరలో తిరిగి ఫిజికల్ హియరింగ్

ABN , First Publish Date - 2021-08-18T22:23:42+05:30 IST

సుప్రీంకోర్టులో త్వరలోనే ఫిజికల్ హియరింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు భారత ప్రధాన..

సుప్రీంకోర్టులో త్వరలో తిరిగి ఫిజికల్ హియరింగ్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో త్వరలోనే ఫిజికల్ హియరింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వెంకటరమణ బుధవారంనాడు సూచనప్రాయంగా తెలిపారు. వారం, పది రోజుల్లో తిరిగి ఫిజికల్ హియరింగ్ మొదలు కావచ్చని ఒక కేసు విచారణ సందర్భంగా సీజేసీ వ్యాఖ్యానించారు. వర్చువల్ హియరింగ్‌లోని సాంకేతిక అవాంతరాలకు ఇక తెరపడనుందని అన్నారు.


సెకెండ్ వేవ్ ముగిసి, కరోనా మహమ్మారి అదుపులో ఉన్నందున ఫిజకల్ హియరింగ్‌కు చొరవ చూపాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, పలువురు లాయర్లు ఇటీవల సీజేఐకి రాసిన లేఖల్లో విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి వర్చువల్ తరహాలోనే సుప్రీంకోర్టు రోజువారీ విచారణలు జరుపుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇటు వర్చువల్, ఇటు ఫిజికల్ హియరింగ్ ఆప్షన్లతో సుప్రీంకోర్టు నడుస్తోంది. పూర్తిగా ఫిజికల్ హియరింగ్ తిరిగి ప్రారంభం కావలసి ఉంది.

Updated Date - 2021-08-18T22:23:42+05:30 IST