కేంద్రమంత్రి రవిశంకర్‌కు సీజేఐ లేఖ
ABN , First Publish Date - 2021-06-26T22:03:17+05:30 IST
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలతో నిర్వహించిన రెండు రోజుల సదస్సు,
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలతో నిర్వహించిన రెండు రోజుల సదస్సు, నిర్ణయాలకు సంబంధించిన వివరాలతో ఆయన లేఖ రాశారు. కరోనా కారణంగా డిజిటల్ పద్ధతితో కొనసాగుతున్న కోర్టుల పనితీరు మెరుగుకు నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కోరారు. దేశంలో న్యాయస్థానాల సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. న్యాయవ్యవస్థలో ఉన్నవారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలన్నారు. కొవిడ్ వల్ల నష్టపోయిన న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు కొలీజియం సిఫారసులపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ లేఖలో విజ్ఞప్తి చేశారు.