వ్యవసాయ రంగానికి.. వాతావరణ మార్పులే పెను సవాల్‌

ABN , First Publish Date - 2021-09-29T07:10:52+05:30 IST

వాతావరణ మార్పులు, పోషకాహార సమస్యలు పెను సవాల్‌గా మారాయని

వ్యవసాయ రంగానికి.. వాతావరణ మార్పులే పెను సవాల్‌

  • 35 ప్రత్యేక వంగడాలు ఆవిష్కరణ
  • జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: వాతావరణ మార్పులు, పోషకాహార సమస్యలు పెను సవాల్‌గా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన 35 ప్రత్యేక వంగడాలను ప్రధాని ఆవిష్కరించారు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని, పోషక విలువలున్న ఆహారాన్ని అందించే ఈ పంట రకాలను జాతికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.


వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటిక్‌ స్ట్రెస్‌ టోలెరన్స్‌ కోసం కొత్తగా నిర్మించిన క్యాంపస్‌ను ప్రారంభించారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నూతన వంగడాలు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. వ్యవసాయ రంగంలో సరికొత్త పద్ధతులతో అధిక రాబడి పొందుతున్న ఐదుగురు రైతులతో ప్రధాని మోదీ మాట్లాడారు. 



ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర మంత్రిమండలి భేటీ జరిగింది. వివిధ ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ, విధానాలు, ప్రభుత్వ ప్రకటనలపై కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, పీయూష్‌ గోయల్‌ ఈ భేటీలో వివరించినట్లు సమాచారం. అలాగే ఈ ప్రాజెక్టులను మరింత వేగంగా ఎలా అమలు చేయాలన్న అంశం మీదా మంత్రులు చర్చించారని అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-09-29T07:10:52+05:30 IST