సీఎంఆర్‌ఎఫ్‌ ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో... కీలక సూత్రధారి లొంగుబాటు

ABN , First Publish Date - 2020-09-25T11:18:15+05:30 IST

సీఎంఆర్‌ఎఫ్‌ ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో... కీలక సూత్రధారి లొంగుబాటు

సీఎంఆర్‌ఎఫ్‌ ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో... కీలక సూత్రధారి లొంగుబాటు

సీఎంఆర్‌ఎఫ్‌ ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో...కీలక సూత్రధారి లొంగుబాటు


ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 24 : సీఎంఆర్‌ఎఫ్‌ ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి గురువారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా సీఎంఆర్‌ఎఫ్‌ ఫేక్‌ చెక్కులకు సంబంధించి ప్రొద్దుటూరు రూరల్‌, త్రీటౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌బీఐ అధికారుల ఫిర్యాదుల మేరకు ముగ్గురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు కేవలం మూడు చెక్కులతోనే సంబంధం ఉందని, రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టినట్లుగా వస్తున్న ప్రచారంలో తనకు సంబంధం లేదంటూ భాస్కర్‌రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.


అంతకు ముందు అతను మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో హోసూరులో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేశానని, అక్కడ పనిచేసే సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఐడియాతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే చెన్నకేశవరెడ్డి నుంచి సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించిన మూడు చెక్కులు తీసుకుని వాటిలో ఉన్న మేరకు లబ్ధిదారులకు డబ్బు ఇచ్చినట్లు తెలిపాడు. ఈ చెక్కులను హోసూరులోని ఆ వ్యక్తికి పంపగా, అతను పేర్లు, అమౌంట్‌ మార్చి పంపాడని, తన మిత్రుల పేరిట వారి ఖాతాల ద్వారా డబ్బు డ్రా చేసుకున్నట్లు చెప్పాడు. అంతేగానీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కోట్ల కుంభకోణంలో తనకు సంబంధం లేదని, అయినా తన పేరే కీలకంగా రావడంతో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వచ్చినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపాడు. మూడు పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఫోర్జరీ, చీటింగ్‌ కేసులకు సంబంధించి లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్‌ లోసారి తెలిపారు. కాగా భాస్కర్‌రెడ్డి లొంగుబాటుపై ఇక్కడి పోలీసు అధికారులు నిర్ధారించలేదు.

Updated Date - 2020-09-25T11:18:15+05:30 IST