తీరనున్న సాగు కష్టాలు

ABN , First Publish Date - 2021-06-19T06:47:42+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ మండల పరిధిలో రూ.121 కోట్ల వ్యయంతో చేపట్టే పథ కం ద్వారా 8 వేల ఎకఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ మండల పరిధిలో రూ.121 కోట్ల వ్యయంతో చేపట్టే పథ కం ద్వారా 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది

తీరనున్న సాగు కష్టాలు
తోపుచర్ల చెరువు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ మండల పరిధిలో రూ.121 కోట్ల వ్యయంతో చేపట్టే పథ కం ద్వారా 8 వేల ఎకఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ మండల పరిధిలో రూ.121 కోట్ల వ్యయంతో చేపట్టే పథ కం ద్వారా 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.  మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం పాతపాలెం వద్ద రూ.29 కోట్లతో, వే ములపల్లి సమీపంలోని తోపుచర్ల పరిధిలో రూ. 10.20 కోట్లతో నిర్మించే  పథకాల ద్వారా  2,900 ఎకరాలకు సాగునీరు అందనుంది.   వీటి నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తారు. వీటి నిర్మాణానికి రూ.2,500 కోట్ల వ్యయం కానుంది

 మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం పాతపాలెం వద్ద రూ.29 కోట్లతో, వే ములపల్లి సమీపంలోని తోపుచర్ల పరిధిలో రూ. 10.20 కోట్లతో నిర్మించే  పథకాల ద్వారా  2,900 ఎకరాలకు సాగునీరు అందనుంది.   వీటి నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తారు. వీటి నిర్మాణానికి రూ.2,500 కోట్ల వ్యయం కానుంది

– మాడ్గులపల్లి/దామరచర్ల

మాడ్గులపల్లి:   ఐదు దశాబ్దాల తర్వాత కృష్ణమ్మ కదిలి రానుందని రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ రూ.10కోట్లతో  ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రక టించడంపై రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ లిఫ్టుల తో చెరువులు నిండడానికి ఐదు దశాబ్దాల తర్వాత కృష్ణమ్మ కదిలి రానుందని రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ రూ.10కోట్లలో ఎత్తిపోతల పథకాలు మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించడంపై రైతు హర్షం వక్తం చేస్తున్నారు. ఈ లిఫ్టులతో చెరువులు నిండి బీడు భూములుగా ఉన్న పొలాలు సస్యశ్యామలమై వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయని  రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

ఇప్పటివరకు  డీ–40,వరదకాల్వ ద్వారా చెరువులను నింపడానికి ప్రభుత్వం నీటిని విడుదల చేసినా చివరి చెరువులకు నీరు అందేదికాదు. చెరువుల్లో నీటిని నింపేందుకు రైతులు రాత్రింబవళ్లూ కాల్వల చుట్టూ గస్తీ కాసేవారు. అయినా చెరువులు నిండనందున పొలాలు బీడు భూమలుగా మారాయి. దీంతో రైతులు మెట్ట పంటలైన పత్తి, కంది, పెసర, శనగ వంటి పంటలను సాగు చేశారు. చెరువులు నిండితే భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగి వరిపంట సాగుచేసుకోవాలనే రైతులకు ప్రతి సారి నిరాశే మిగిలింది. సీఎం కేసీఆర్‌ రూ.10కోట్ల నిధులతో నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఎల్‌–14 స్టేజ్‌–1 పంప్‌హౌజ్‌ నుంచి మాడ్గులపల్లి మండలంలోని తోపు చర్ల, పుచ్చకాయల గూడెం, సీత్యాతండా, దేవతలబావి గూడెం, గణపతివా రిగూడెం, బొమ్మకల్‌ గ్రామాల గొలుసుకట్టు చెరువులను నింపేందుకు లిఫ్టు మంజూ రు చేస్తామని ప్రకటించారు. దీంతో అధికారులు భూములను సర్వే చేసి వేములపల్లి పరిధిలోని ఎల్‌– 14 స్టేజ్‌–1 పంప్‌హౌజ్‌ నుంచి తోపుచర్ల, పుచ్చకాయల గూడెంవరకు సుమారు 5.6కి.మీ మేర భూగర్భ పైపులైన్‌ వేసి చివరి చెరువులకు నీటిని నింపేందుకు ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపించారు. తోపుచర్ల గ్రామంలోని పెద్ద చెరువు, చిన్న చెరువు, సీత్యాతండా చెరువు, గణపతివారిగూడెం చెరువు, దేవతలబావిడూగెం చెరువు, బొ మ్మకల్‌ చెరువులోకి నీటిని నింపడం ద్వారా సా గు, తాగునీటి కష్టాలు తీరనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నిండడంతో ఐదు దశాబ్దాలుగా బీడు భూము లుగా ఉన్న వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తోపుచర్ల, సీత్యాతండా, గణపతివారిగూడెం, దేవతలబావిగూడెం, బొమ్మకల్‌ గ్రామాల పరిధిలోని ఆరు చెరువులకు ప్రస్తుతం నీరందనందున కేవలం దాదాపు 60 ఎకరాలకు నీరందు తోంది. ప్రస్తుతం ప్రభుత్వం లిఫ్టు మంజూరు చేయడంతో ఈ చెరువుల కింద సుమారు 316ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. అదేవిధంగా చెరువులోకి సమృద్ధిగా నీరు చేరితే, భూగర్భజలాలు వృద్ధి చెంది బోరుబావుల కిం ద సుమారు మరో 500 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. 

కట్టంగూరు మండలంలో..

నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూరు మండల పరిధిలో రూ.121 కోట్ల వ్యయంతో చేపట్టే పథకం ద్వారా 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

చివరి భూముల్లో చిగురించిన ఆశలు

ఉమ్మడి మండలంలో భారీ ఎత్తిపోతల పథకాలు మంజూరు

దామరచర్ల: చుట్టూ నీరున్నా వాటిని వినియోగించుకొనే పరిస్థితి లేదు. ఓ పక్క కృష్ణమ్మ,  మరో పక్క మూసీనది వెళ్తున్నా ఉమ్మడి దామరచర్ల మండల ప్రజలకు మాత్రం నీటి లభ్యత అందని ద్రాక్షగా మిగిలింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఉమ్మడి దామరచర్ల మండలం నుంచి  ఐదేళ్ల క్రితం అడవిదేవులపల్లి నూతన మండలంగా ఆవిర్భవించింది. ఈరెండు మండలాలు నాగార్జునాసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. దామరచర్ల మండలంలో ప్రధానంగా వరి, ప్రత్తి, మిర్చి సాగుచేస్తుంటారు. అడవిదేవులపల్లి మండలంలో పత్తి, మిర్చి, వరి పంటలు రైతులు సాగు చేస్తుంటారు. పేరుకే ఆయకట్టు భూములు అయినప్పటికీ చివరి భూములకు దశాబ్దాలుగా నీరందని పరిస్థితి ఉంది. దీనికితోడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈప్రాంత రైతులు ప్రధానంగా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. వేసవిలో నీటి లభ్యత తగ్గి చివరి దశలో పంటలు ఎండిపోవటం పరిపాటిగా మారింది. దీంతో సాగునీటి కోసం రైతులు నానాఅవస్థలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఎత్తిపోతల పథకాల ఏర్పాటుపై ప్రజలకు హామీ ఇచ్చారు.  ఈనేపథ్యంలో ఉమ్మడి మండలంలో ఎత్తిపోతల ఆవశ్యకతను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి మంజూరులో విజయం సాధించారు. ఈఏడాది మార్చి 28న మండలంలోని మంగళదుబ్బతండా వద్ద మూసీనదిపై 75.93 కోట్ల వ్యయంతో కేశవాపురం– కొండ్రపోలు ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈనిర్మాణం పూర్తయితే 5,875 ఎకరాల భూమి పూర్తిస్థాయిలో సాగులోకి వస్తుంది. దామరచర్ల మండలంలో తాళ్లవీరప్పగూడెం సమీ పంలోని అన్నమేరువాగు కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో రూ.229.25 కోట్ల వ్యయంతో 8610 ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకువచ్చేందుకు బొత్తలపాలెం–వాడపల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతులగండి వద్ద 219.9 కోట్ల వ్యయంతో 12,239 ఎకరాలు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు బాల్నేపల్లి– చాంప్లాతండా ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాలు పూర్తయితే దశాబ్దాల కల నెరవేరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 లిఫ్టును త్వరగా పూర్తి చేయాలి

చివరి చెరువులకు నీరు అందకపోవడంతో ప్రతిసారి భూములను సాగుచేసుకోలేకపోతున్నాం. నీటి కోసం ప్రతిసారి వరదకాల్వ చుట్టూ తిరిగినా చివరి చెరువులకు నీరందకపోయేది. సీఎం లిఫ్టు మంజూరుకు హామీ ఇవ్వడంతో సాగులోకి వస్తాయని ఆశ కలిగింది. అధికారులు అలసత్వం వహించకుండా  లిఫ్టు మంజూరుకి ప్రతిపాదనలను పంపించి పనులను త్వరితగతిన పూర్తిచేసి బీడుభూములకు నీరందించి రైతులను ఆదుకోవాలి.

– ఎర్రెడ్ల అంజిరెడ్డి, రైతు, తోపుచర్ల 


 ప్రతిపాదనలు పంపాం

వేములపల్లి మండలంలోని ఎల్‌–14 ద్వారా మండలంలోని తోపుచర్ల పరిధిలోని ఆరు చెరువుల ను నింపేందుకు ప్రభుత్వ అనుమతు ల కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుం డి అనుమతులు వచ్చిన వెంటనే పనులను పూర్తిచేస్తాం.

–  కె. దీక్షిత ఎన్‌ఎ్‌సపీ, ఏఈఈ

నిర్మాణం పూర్తయితే సాగులోకి భూములు

2.5 ఎకరాల పొలం బోరుబావి క్రింద పంట సాగు చేస్తున్నా. పంట చివర్లో నీటి లభ్యత తగ్గి మోటార్లు కాలిపోవటం, పంట ఎండిపోతున్నాయి.  ఎత్తిపోతల పథకం పూర్తయితే మా సాగునీటి కష్టాలు తొలగిపోతాయి. ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు రుణపడి ఉంటాం.

– నూనావత్‌ బాలునాయక్‌(రైతు), నూనావత్‌తండ


Updated Date - 2021-06-19T06:47:42+05:30 IST