ప్రజలను జాగృతం చేసే బాధ్యత మీదే

ABN , First Publish Date - 2020-07-14T11:25:02+05:30 IST

కరోనా పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, కేసులు పెరుగుతున్నందున చాలా జాగ్రత్తలు తీసు కోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రజలను జాగృతం చేసే బాధ్యత మీదే

 విలేకరులతో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


కాకినాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, కేసులు పెరుగుతున్నందున చాలా జాగ్రత్తలు తీసు కోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలను జాగృతం చేసే బాధ్యత అధికారులతో పాటు మీడియాకు ఉందని, విలేకరులు తగిన రక్షణ చర్యలు తీసుకుని వార్తల సేకరణ చేయాలని సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అత్యధికంగా ఈ నెల 12న 368 కొవిడ్‌ కేసులు నమెదవ్వడం విచారకరమన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్‌ కేసులు ఉన్నాయ న్నారు. కేసులు పెరగకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మెల గాలన్నారు. మంగళవారం నుంచి ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే ప్రజలు రోడ్లపైకి రావడానికి అవకాశం ఉందన్నారు.


ఆపై వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారన్నారు. అవసరం లేకపోయినా ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండడాన్ని ఏమనాలన్నారు. పని లేకున్నా బయటకు రావద్దని ఎంత చెప్తున్నా ఖాతరు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అందరూ గ్రహిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుం దన్నారు. పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌ సమాధాన మిచ్చారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ లక్ష్మీశ పాల్గొన్నారు.


Updated Date - 2020-07-14T11:25:02+05:30 IST