సాగరమాలతో అభివృద్ధి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-08-12T11:08:00+05:30 IST

జిల్లాలోని తీరప్రాంత ప్రదేశాలలో సాగరమాల ప్రాజెక్టు ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ..

సాగరమాలతో అభివృద్ధి కార్యక్రమాలు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


కాకినాడ (డెయిరీఫారమ్‌ సెంటర్‌), ఆగస్టు 11: జిల్లాలోని తీరప్రాంత ప్రదేశాలలో సాగరమాల ప్రాజెక్టు ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ డి.మురళీఽధర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ఆఽధ్వర్యంలో మంగళవారం సాగరమాల ప్రాజెక్టు చైర్మన్‌ శారద ప్రసాద్‌ దేశంలోని 77 తీర ప్రాంత జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మురఽళీధర్‌రెడ్డి మాట్లాడుతూ సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టులు అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, షిపింగ్‌ హార్బర్‌ల అభివృద్ధి, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటు, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటు, ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ చేపట్టనున్నామన్నారు.


అదే విధంగా  మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూర్చే కార్యక్రమాలకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. తొండంగి మండలంలో జీఎంఆర్‌ గ్రూపు సంస్థ ఒక పోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని చెప్పారు.  అదే విధ ంగా రాష్ట్ర మారిటైన్‌ బోర్డు రూ.100 కోట్లతో యాంకరేజ్‌ పోర్టు అభివృద్ధికి  ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఉప్పాడ వద్ద రూ.350 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే టెండర్‌ ప్రక్రియ ప్రారంభించనున్నామని సాగరమాల ప్రాజెక్టు చైర్మన్‌కు కలెక్టర్‌ తెలిపారు. త్వరితగతిన ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్టు ఎస్‌ఈ జీవీ రాఘవరావు, మత్స్యశాఖ జేడీ పి.కోటేశ్వరరావు, డీ ఐపీసీ డీఎం బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-12T11:08:00+05:30 IST