బియ్యం అక్రమ రవాణాపై కలెక్టర్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2020-09-23T06:22:34+05:30 IST

జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం ప క్కదారి పడుతున్నాయని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం అధికారులను

బియ్యం అక్రమ రవాణాపై కలెక్టర్‌ సీరియస్‌

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన..జిల్లా వ్యాప్తంగా తనీఖీలకు ఆదేశాలు..పలువురిపై  6-ఏ కేసులు నమోదు


జగిత్యాల, సెప్టెంబరు 22( ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం ప క్కదారి పడుతున్నాయని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం అధికారులను కదిలించింది. పేదల బి య్యానికి కొందరు పెద్దలు ఎసరు పెట్టి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ వచ్చిన కథనా న్ని కలెక్టర్‌ రవి సీరియస్‌గా పరిగణించారు. ఉ న్న పలంగా విచారణకు ఆదేశాలు జారీ చేశా రు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద న్‌ కుమార్‌తో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో తహసీల్దార్లు తనిఖీలు చేసి అక్ర మంగా రేషన్‌ బియ్యం తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాంచారు.


ఎవరైనా పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే వారిపై కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీ సుకోవాలని సూచించారు. నిరుపేదలకు అందాల్సిన బియ్యం కొందరు బ్రోకర్లు పక్కదారి ప ట్టిస్తుండగా కొందరు అధికారుల అం డదండలు ఉన్నాయని కథనం రావ డంతో కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించారు. ఎవరైనా అధికారులు సహక రిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లు మంగళవారం తనిఖీలు చేపట్టారు. గొల్లపెల్లి, పెగడప ల్లిలో 10 క్వింటాళ్ల చొప్పున రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో ముందస్తుగానే బియ్యం వ్యాపారం చేసేవారు అప్రమత్తం అయినట్లు తెలిసింది.


విసృతంగా తనిఖీలు..

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌ కుమార్‌, పౌర సరఫరా ల సంస్థ జిల్లా మేనేజర్‌ రజనీకాంత్‌ల ఆద్వర్యంలో కోరుట్ల, జగిత్యాల లో రైస్‌ మిల్లులతో పాటు 18 మండలాల్లోని రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, జగిత్యాల రూరల్‌ లోని మూడు రేషన్‌ షాపుల్లో వ్యతాసాలు ఉండడంతో 6-ఏ కేసులు నమోదు చేశా రు. అలాగే గొల్లపెల్లిలో ఆటోలో బియ్యం రవాణా, కోరుట్లలో రెండు కిరాణా షాపులపై 6-ఏ కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-09-23T06:22:34+05:30 IST