ఇంటి వద్దకే నిత్యావసరాలు

ABN , First Publish Date - 2020-03-27T10:27:13+05:30 IST

కర్నూలులో 9 కిరాణం దుకాణదారులతో మాట్లాడామని, ప్రజల ఇళ్ల వద్దకే సరుకులు పంపేలా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వీరపాండి యన్‌ అన్నారు.

ఇంటి వద్దకే నిత్యావసరాలు

కలెక్టర్‌ వీరపాండియన్‌

ఓపెన్‌ మార్కెట్లకు స్థల పరిశీలన


నంద్యాల (ఎడ్యుకేషన్‌), మార్చి 26: కర్నూలులో 9 కిరాణం దుకాణదారులతో మాట్లాడామని, ప్రజల ఇళ్ల వద్దకే సరుకులు పంపేలా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వీరపాండి యన్‌ అన్నారు. గురువారం ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి కలెక్టర్‌ నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ అదే తరహాలో నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఉదయం 6 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజలు కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. నంద్యాలలోని ఎనిమిది ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తామని తెలి పారు. లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ప్రజలు ఇళ్లకే పరిమిత మవ్వాలని కలెక్టర్‌ సూచించారు. కరోనా నివారణకు ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఒక్కటే మార్గమని అన్నారు. నిత్యావసర వస్తువులు, ఔషధాల కోసం పదే పదే రోడ్లపైకి రావద్దని కోరారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిం చేలా యజమానులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


ప్రజలు ఇంటి నుంచి రెండు, మూడు కిలోమీటర్లు దాటి వెళ్ళ వద్దని సూచించారు. జిల్లాకి 1150 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించామని, ఇప్పటికే 69 మందికి పరీక్షలు కూడా చేయిం చామని తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 14 నియోజకవర్గ కేంద్రాల్లో క్యారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కేంద్రంలో 200 పడ కల ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిం చారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా బాధ్యతగా వ్యవహరించా లని, రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ చిదానందారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌  వెంకటకృష్ణ, తహసీ ల్దార్‌ రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-03-27T10:27:13+05:30 IST