‘కమ్యూనిటీ కిచెన్‌’

ABN , First Publish Date - 2021-11-26T09:02:48+05:30 IST

ప్రజా పంపిణీ పథకం కిందకు రాని ప్రజల ఆకలి తీర్చేందుకు ‘కమ్యూనిటీ కిచెన్ల’ ఏర్పాటుపై రాష్ట్రాల ఆహార శాఖల కార్యదర్శులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆహార

‘కమ్యూనిటీ కిచెన్‌’

  • విధివిధానాల రూపకల్పనకు కార్యదర్శుల బృందం


న్యూఢిల్లీ, నవంబరు 25: ప్రజా పంపిణీ పథకం కిందకు రాని ప్రజల ఆకలి తీర్చేందుకు ‘కమ్యూనిటీ కిచెన్ల’ ఏర్పాటుపై రాష్ట్రాల ఆహార శాఖల కార్యదర్శులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయుయల్‌ తెలిపారు. కొత్త పథకం విధివిధానాలపై ఈ బృందం విస్తృత చర్చలు జరుపుతుందన్నారు. గురువారమిక్కడ అన్ని రాష్ట్రాల ఆహార మంత్రులతో నిర్వహించిన సమావేశంలో గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి 3 వారాల్లోగా తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. పథకం విధివిధానాల ప్రతిపాదనలపై 29న అధికారుల స్థాయిలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2021-11-26T09:02:48+05:30 IST