మహానివేదన మందిరంలోకి అనుమతి లేదంటూ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-07-23T05:14:23+05:30 IST

కంది మల్లాయపల్లె పురసంస్థా నం దేవాలయంలోని మహా నివే దన మందిరంలోకి మారుతీ మహాలక్షుమ్మ ప్రవేశించడానికి అనుమతి లేదంటూ స్థానిక పోలీ సు స్టేషన్‌లో గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు.

మహానివేదన మందిరంలోకి అనుమతి లేదంటూ ఫిర్యాదు
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కందిమల్లాయపల్లె గ్రామ ప్రజలు

బ్రహ్మంగారిమఠం, జులై 22: కంది మల్లాయపల్లె పురసంస్థా నం దేవాలయంలోని మహా నివే దన మందిరంలోకి మారుతీ మహాలక్షుమ్మ ప్రవేశించడానికి అనుమతి లేదంటూ స్థానిక పోలీ సు స్టేషన్‌లో  గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇటీవల గ్రామ స్తుల అభిప్రాయం మేరకు బ్రహ్మం గారిమఠం పీఠాధిపతి నిర్ణయం జరిగింది. అయితే ఈ నిర్ణయం సరికాదంటూ దివంగత పీఠాధిపతి వీరబోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతీ మహాలక్షుమ్మ కోర్టును ఆశ్రయించింది.  దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పీఠాధిపతి నిర్ణయం తేలేవరకు మారుతీమహాలక్షుమ్మను బ్రహ్మంగా రిమఠం దేవస్థానానికి అనుమతించబోమని లిఖితపూర్వకంగా బి.మఠం ఎస్‌ఐ శ్రీని వాసులుకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-07-23T05:14:23+05:30 IST