పర్యాటక అభివృద్ధికి సమగ్ర విధానం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-16T08:48:57+05:30 IST

పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు ఊతమిచ్చేలా సమగ్ర జాతీయ ప ర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి అన్నారు.

పర్యాటక అభివృద్ధికి సమగ్ర విధానం: కిషన్‌రెడ్డి

ముంబై, మే 15 : పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు ఊతమిచ్చేలా సమగ్ర జాతీయ ప ర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర  మం త్రి కిషన్‌రెడ్డి అన్నారు. ముంబైలో రెండు రోజుల పా టు జరిగిన భారత్‌, అంతర్జాతీయ క్రూయిజ్‌ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. క్రూయిజ్‌ ప ర్యాటక అభివృద్ధి కోసం ఆ రంగంలోని వాటాదారులు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన ప్రణాళిక కార్యాచరణను రూపొందిచుకోవాలని సూచించారు. ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు కిషన్‌రెడ్డి, శర్వానంద సోనోవాల్‌ సమక్షంలో.. ముంబై పోర్టు ట్రస్టు, ఇన్లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నౌకా సేవలందించే పలు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి.

Updated Date - 2022-05-16T08:48:57+05:30 IST