ఆస్తుల క్రయవిక్రయాలకు రెడీ

ABN , First Publish Date - 2020-10-29T06:47:02+05:30 IST

నూతన పద్ధతిలో ఆస్తుల క్రయవిక్రయాలకు అంతా సిద్ధమైంది. గురువారం నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేయనున్నారు

ఆస్తుల క్రయవిక్రయాలకు రెడీ

నేటి నుంచి ధరణి పోర్టల్‌లో సమగ్ర వివరాలు 

తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ బాధ్యతలు 

సబ్‌ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర భూములకే పరిమితం

హైదరాబాద్‌లో శిక్షణ పొందిన తహసీల్దార్లు 

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం

ధరణి పోర్టల్‌ ఆధారంగానే రిజిస్ట్రేషన్లకు అవకాశం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నూతన పద్ధతిలో ఆస్తుల క్రయవిక్రయాలకు అంతా సిద్ధమైంది.  గురువారం నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేయనున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించారు. తహసీల్‌ కార్యాలయల్లోనే రిజిస్ర్టేషన్లు జరగనున్నాయి. ఇందుకోసం తహసీల్దార్లకు హైదరాబాద్‌లో తుది విడత శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో భూముల సమగ్ర వివరాలను నమోదయ్యాయి. ఆస్తుల సర్వేను కూడా పూర్తి చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ప్రయోగాత్మకంగా అధికారులు, ఐడీ, పాస్‌ వర్డ్‌, లాగిన్‌ సాంకేతిక అంశాలపై అవగాహన పెంచారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ మాత్రమే జరగనుంది, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందోననే దానిపై మాత్రం సందిగ్ధం నెలకొంది. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు, రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 171 రెవెన్యూ గ్రామాలు 255   పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 99,847 సర్వే నంబర్లు ఉండగా 4,61,650 ఎకరాల భూమి ఉంది.


సిరిసిల్ల మండలంలో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో 2,614 సర్వే నంబర్లు ఉండగా 12,933 ఎకరాల భూమి ఉంది. తంగళ్లపల్లి మండలంలో 16 రెవెన్యూ గ్రామాల్లో 9,101 సర్వే నంబర్లు, 45,672 ఎకరాలు, వేములవాడ అర్బన్‌ మండలంలో ఎనిమిది రెవెన్యూ గ్రామాల్లో 4,917 సర్వే నంబర్లు, 20,744 ఎకరాలు, వేములవాడ రూరల్‌ మండలంలో 15 రెవెన్యూ గ్రామాల్లో 6,080 సర్వే నంబర్లు, 26,040 ఎకరాలు, గంభీరావుపేట మండలంలో 18 రెవెన్యూ గ్రామాల్లో 9,088 సర్వే నంబర్లు, 38,552 ఎకరాలు, చందుర్తి మండలంలో 11 రెవెన్యూ గ్రామాల్లో 6,622 సర్వే నంబర్లు, 41,846 ఎకరాలు, రుద్రంగి మండలంలో 2 రెవెన్యూ గ్రామాల్లో 1,028 సర్వే నంబర్లు, 22,688 ఎకరాలు, బోయినపల్లి మండలంలో 16 రెవెన్యూ గ్రామాల్లో 8,691 సర్వే నంబర్లు, 34,802 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 17 రెవెన్యూ గ్రామాల్లో 9,923 సర్వే నంబర్లు, 45,948 ఎకరాలు, వీర్నపల్లి మండలంలో 6 రెవెన్యూ గ్రామాల్లో 1,154 సర్వే నంబర్లు, 27,675 ఎకరాలు, ముస్తాబాద్‌ మండలంలో 16 రెవెన్యూ గ్రామాల్లో 10,020 సర్వే నంబర్లు, 38,378 ఎకరాలు, ఇల్లంతకుంట మండలంలో 21 రెవెన్యూ గ్రామాల్లో 11,853 సర్వే నంబర్లు, 54,927 ఎకరాలు, కోనరావుపేట మండలంలో 20 రెవెన్యూ గ్రామాల్లో 7,861 సర్వే నంబర్లు, 51,440 ఎకరాల భూమిని ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. క్రయ విక్రయాలు పారదర్శకంగా సాగడానికి ముందుగా స్లాట్‌ బుక్‌ చేసి దాని ప్రకారం రిజిస్ర్టేషన్లు చేయనున్నారు. 


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వస్తున్నా వ్యవసాయేతర ఆస్తులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తుల రిజిస్ర్టేషన్లపై సందిగ్ధం నెలకొంది.  వీటి రిజిస్ట్రేషన్‌ పక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల జిల్లాలో ఆస్తుల సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో 92.21 శాతం ఆస్తుల సర్వే పూర్తి చేశారు. గ్రామాల్లో 1,39,008 ఇళ్లు ఉండగా ఇప్పటి వరకు 1,28,174 ఇళ్ల వివరాలను నమోదు చేశారు. 10,834 ఆస్తుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 98.22 శాతం, వేములవాడ మున్సిపాలిటీలో 85 శాతం నమోదు చేశారు. సిరిసిల్లలో 21,724 ఆస్తులు ఉండగా 21,338 ఆస్తుల వివరాలను నమోదు చేశారు. వేములవాడలో 13,475 ఆస్తులు ఉండగా 11,440 నమోదు చేశారు. ధరణిలో ఆన్‌లైన్‌ చేయడంలో మొదట్లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న తర్వాత సర్వే వేగంగా ముగించారు. కొన్ని గ్రామాల్లో నెట్‌ వర్క్‌ సమస్యలు ఎదుర్కొన్నారు. అఫ్‌లైన్‌లో మొదట నమోదు చేసి తర్వాత ధరణి పోర్టల్‌లో పొందుపర్చారు. 

Updated Date - 2020-10-29T06:47:02+05:30 IST