ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-03T04:57:40+05:30 IST

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం డిపో గేటు ఎదుట టిమ్‌ డ్రైవర్లు ఆందోళన చేశారు.

ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన
డిపో ఎదుట ధర్నా చేస్తున్న డ్రైవర్లు

ఆసిఫాబాద్‌, మార్చి 2: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం డిపో గేటు ఎదుట టిమ్‌ డ్రైవర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి తాము టిమ్‌ సర్వీసులను నడపబోమని, పని ఒత్తిడి తీవ్రంగా ఉంటోందన్నారు. ఈ నెల 16 నుంచి కండక్టర్‌తో కూడిన డ్యూటీలను వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్‌ కృష్ణమూర్తికి అందజేశారు.   

Updated Date - 2021-03-03T04:57:40+05:30 IST