ఐరోపాపై పుతిన్‌ అణుఖడ్గం?

ABN , First Publish Date - 2022-02-26T07:20:45+05:30 IST

అణుయుద్ధం! సుదీర్ఘకాలంగా ఈ మాట అనేందుకు కూడా ప్రపంచ దేశాలు సాహ సం చేయడం లేదు.

ఐరోపాపై పుతిన్‌ అణుఖడ్గం?

తీవ్ర పరిణామాల హెచ్చరికపై ప్రపంచ దేశాల  ఆందోళన


వార్సావ్‌, ఫిబ్రవరి25: అణుయుద్ధం! సుదీర్ఘకాలంగా ఈ మాట అనేందుకు కూడా ప్రపంచ దేశాలు సాహ సం చేయడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం అణుఖడ్గాన్ని దూసేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఐరోపా దేశాల కట్టడికి ఆయన ఆ దిశగా అడగులు వేస్తున్నారని ప్రపంచ దేశాలంటున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముందు ఆయన ప్రకటనను చూస్తే ఈ సందేహాలే కలుగుతున్నాయని అంతర్జాతీ య విశ్లేషకులు అంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ‘తీవ్ర పరిణామాలు’ ఉం టాయన్నారు. తమ వద్ద మరిన్ని ‘ఆయుధాలు’ ఉన్నాయని కూడా హెచ్చరించారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే అణుయుద్ధం తప్పదనే సంకేతాలిచ్చినట్టు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. మరో పర్యావరణ పెనుముప్పు పొంచి ఉందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి హెచ్చరించడం గమనార్హం. మరోవైపు 1945 తర్వాత ఏ దేశమూ అణ్వాయుధాలు వినియోగించ లేదు.


అప్పుడు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబులతో 2 లక్షల మంది పౌరులు మృతి చెందారు. ‘ఇది సరైన చర్యేనా’ అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. కాగా, ఉక్రెయిన్‌, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటి నుంచి రష్యా-నాటోల మధ్య అణు యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయ న ఉక్రెయిన్‌కు నాటో ఎలాంటి బలగాలనూ పంపించదని చెప్పారు. ఎందుకంటే ఇదే జరిగితే.. అమెరికా, రష్యాల మధ్య అణుయుద్ధం ఏర్పడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి వస్తుందని భయపడు తున్నారు. అందేకే రష్యాపై ఆర్థిక ఆంక్షలకు సిద్ధమయ్యారు. రష్యా దూకుడు పెంచి నాటో సభ్య దేశాలపై దాడులు చేస్తే అమెరికా తన వ్యూహాలను మార్చుకునే అవకాశముంది. మరోవైపు తమ అణు సామర్థ్యంపై బైడెన్‌ సమీక్ష నిర్వహించడం గమనార్హం. 


‘చెర్నోబిల్‌’లో పెరిగిన రేడియేషన్‌!

ఉక్రెయిన్‌ రాజధానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్‌ అణుకేంద్రాన్ని రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. దీంతో చెర్నోబిల్‌లో గామా రేడియేషన్‌ సాధారణ స్థాయిని మించి పెరిగిపోయినట్టు ఉక్రెయిన్‌ న్యూక్లియర్‌ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జనరల్‌ ఇగోర్‌ కొనషెంకోవ్‌ ఖండించారు. కాగా, ఉక్రెయిన్‌-రష్యాల మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు హేగ్‌లోని అంతర్జాతీయ యుద్ధ నేరాల శాశ్వత కోర్టు తెలిపింది.

Updated Date - 2022-02-26T07:20:45+05:30 IST