పేదలకు వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తారా?: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-01-18T07:13:21+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పేదలు, అణగారిన వర్గాలకు ఉచితంగా ఇస్తారా? అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది.

పేదలకు వ్యాక్సిన్‌  ఉచితంగా ఇస్తారా?: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జనవరి 17: కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పేదలు, అణగారిన వర్గాలకు ఉచితంగా ఇస్తారా? అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇస్తామంటున్న ప్రభుత్వం మిగిలిన వారికి ఎప్పుడిస్తుందో, ఉచితంగా ఇస్తుందో లేదో స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. దేశంలో 81.35 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువనే ఉన్నారని, వారు వ్యాక్సిన్‌కు ఖర్చు చేసే స్థితిలో లేరని గుర్తు చేశారు. 

Updated Date - 2021-01-18T07:13:21+05:30 IST