నాలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిన సోనియా గాంధీ

ABN , First Publish Date - 2020-12-20T20:01:44+05:30 IST

అసమ్మతి నేతలతో సోనియా గాంధీ సమావేశం ముగియగానే అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది.

నాలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ : అసమ్మతి నేతలతో సోనియా గాంధీ సమావేశం ముగియగానే అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పీసీసీలపై దృష్టి సారించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక గుజరాత్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడంతో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక మూడో రాష్ట్రం మధ్యప్రదేశ్. పీసీసీ అధ్యక్ష పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. అయితే జీ 23 నేతలు సోనియాతో భేటీ అయ్యేట్లు చేసింది కమల్‌నాథే. ఈ నాలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నియామకాలపై సోనియా గాంధీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ముంబై పీసీసీ కమిటీలో అధిష్ఠానం స్వల్ప మార్పులు కూడా చేసింది. పీసీసీ అధ్యక్షుడు బాలాసాహేబ్ థోరట్‌‌కు సీఎల్పీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది. ఇక.... అసోం, కేరళలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ ప్రధానకార్యదర్శులను ఇన్‌చార్జిలుగా నియమించే అంశాన్నీ సోనియా గాంధీ పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-12-20T20:01:44+05:30 IST