Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి హరీష్ తక్షణమే రాజీనామా చేయాలి: చెరుకు శ్రీనివాస్

దుబ్బాక: మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరు సంవత్సరాలుగా వంద పడకల ఆసుపత్రి పూర్తి కాకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు దుబ్బాక, సిద్దిపేట రెండు కండ్లు అని చెప్పిన హరీష్ రావుకు ఏమైందని నిలదీశారు. ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా దుబ్బాకకు రాలేదు ఎందుకని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వంద పడకల ఆసుపత్రి లో ఆక్సిజన్ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. దమ్ముంటే నర్సింగ్ కళాశాల దుబ్బాకకు తేవాలని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. కరోనాతో ప్రైవేటు ఆసుపత్రిలో దోపిడీకి గురైన బాధితులకు న్యాయం చేయాలని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 

Advertisement
Advertisement