కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2020-11-22T20:42:28+05:30 IST

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణకు గురైన కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. గాజులరామారం డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఎంపీ రేవంత్‌రెడ్డి ఎస్‌ఈసీకి అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి రేవంత్ విజ్ణప్తి చేశారు.

Updated Date - 2020-11-22T20:42:28+05:30 IST