కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా గాంధీరాజు ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-10-22T05:24:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా దాట్ల గాంధీరాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా గాంధీరాజు ప్రమాణ స్వీకారం

కాకినాడ సిటీ, అక్టోబరు 21: కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా దాట్ల గాంధీరాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు విచ్చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పళ్లంరాజు, రుద్రరాజు మాట్లాడుతూ త్వరలో జరగనున్న కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయపతాకం ఎగురవేసేలా పనిచేయాలన్నారు.  నూతన అధ్యక్షుడు గాంధీరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు.  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్‌, కాకినాడ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి జమ్ము ఆదినారాయణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి మల్లిపూడి రాంబాబు, రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌, కాకినాడ సిటీ ఇన్‌చార్జి కోలాప్రసాదవర్మ, నాయకులు జవ్వాద్‌ ఆలీ, కుక్కల పోతురాజు, తాళ్లూరి రాజు, కంభం రాజబాబు, అయితాబత్తుల సుభాషిణి పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-22T05:24:38+05:30 IST