సోయాచేనులో నీటిని సంరక్షించుకోండి

ABN , First Publish Date - 2021-06-24T06:56:29+05:30 IST

సోయాచేనుల్లో నీటిని సంరక్షించే విధానాన్ని ముథోల్‌ ఏరువాక కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత జి.వీరన్న ప్రయోగం చేసి చూయించారు.

సోయాచేనులో నీటిని సంరక్షించుకోండి
సోయాచేనును పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్త డాక్టర్‌ జి. వీరన్న

ముథోల్‌, జూన్‌, 23 : సోయాచేనుల్లో నీటిని సంరక్షించే విధానాన్ని ముథోల్‌ ఏరువాక కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత జి.వీరన్న ప్రయోగం చేసి చూయించారు. బుధవారం ముథోల్‌ లోని ఎస్‌.రాకేష్‌ అనే రైతుచేనులో చేసి చూపించినట్లు తెలిపారు. విధంగా రైతులు చేసినట్లయితే లాభదాయ కంగా ఉంటుందని  ప్రతి ఎనిమిది సోయా సాల్లమధ్యలో నాగలితో ఎనిమిది అంగుళాల లోతులో ఒక్కోసాలు వేయాలన్నారు. దీని ద్వారా రెండు ఉపయో గాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తక్కువ వర్షం పడినప్పుడు మొక్కలకు మంచి నీటి తేమ ఉంటుందని సాల్లల్లో ఆగిన నీటిని ఎక్కువ వర్షాలు పడినప్పుడు సోయాపంట నీటిలో మునగకుండా సాల్ల ద్వారా బయటకు వెళ్లిపోతాయని దీంతో పంటకు నష్టం జరగదని అన్నారు. ఈ విధంగా చేయుట ద్వారా పం టకు మంచిగా గాలి, వెలుతురు సోకి అధిక దిగుబడులు వస్తాయని తెలి పారు. అలాగే పంటకు ఎరువులు, పైముందులు పిచికారి చేయడానికి సుల భమవుతుందన్నారు. శాస్త్రవేత్తలు డా. సంపత్‌కుమార్‌ రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-06-24T06:56:29+05:30 IST