Abn logo
Jun 30 2020 @ 15:35PM

750కి పెరిగిన కంటైన్మెంట్ జోన్లు

ముంబై: దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ముంబై. ఒక్క ఢిల్లీ మినహా ముంబైలో ఉన్నన్ని కరోనా పాజిటివ్ కేసులు మరే ఇతర నగరంలో లేవు. ప్రస్తుతమున్న కేసులకు తగ్గట్టుగానే నగరంలో కేసుల సంఖ్య మరింత ఎక్కువ శాతంతో పెరుగుతూ వస్తోంది. దీనికి అనుగుణంగానే నగరంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా బృహన్‌ముంబై పెంచిన వాటితో కలిపి ప్రస్తుతానికి ముంబైలో 750 కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.


ఇదిలా ఉంటే మహారాష్ట్రలో లక్షన్నరకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇందులో సగానికి పైగా కరోనా వైరస్ భారి నుంచి బయటపడి కోలుకున్నారు. సుమారు ఏడున్నర వేల మంది చనిపోయారు. ప్రస్తుతం 73,000 పై చిలుకు యాక్టివ్ కేసులున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement