Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలివ్వాలి

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 28: దేశంలో సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పోరాటాలు చేసి హక్కులు సాధించేందుకు విశేష కృషి చేస్తున్నది ఏఐటీయూసీ మాత్రమేనని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు అన్నారు. విశాఖ స్టీల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) 9వ మహాసభ ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, వైద్య సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనాతో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ కార్మికులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 60 ఏళ్లు దాటిన కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి మంత్రి రవి మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా కార్మిక సంక్షేమం విషయంలో రాజీ లేకుండా పోరాడుతున్నామన్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడడిగా నందికి తాతారావు, ప్రధాన కార్యదర్శిగా మంత్రి రవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లక్కరాజు సొంబాబు, కోశాధికారిగా సీహెచ్‌.నాగరాజు, అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీగా మురళీకృష్ణ, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా రంజాన్‌ఆలీలు ఎన్నికయ్యారు. 

Advertisement
Advertisement