కట్టడితో కంట్రోల్‌

ABN , First Publish Date - 2021-06-12T05:22:41+05:30 IST

రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా మే 12వ తేదీ నుంచి లా క్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

కట్టడితో కంట్రోల్‌
కట్టడి సమయంలో నిర్మానుష్యంగా పాలమూరులోని క్లాక్‌టవర్‌ (ఫైల్‌)

- కరోనా రెండో దశ లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు

- కఠినంగా అమలు చేసిన పోలీసులు

- నెల రోజుల్లో ఆరు రెట్లు తగ్గిన పాజిటివ్‌ కేసులు

- సంయమనం పాటించిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు

- జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల సరిహద్దుల్లో పది చెక్‌ పోస్టులు

- ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా

- హైరిస్క్‌ కేటరిగీ వారికి టీకీకరణ

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో అదుపులోకి వస్తున్న కరోనా


మహబూబ్‌నగర్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా మే 12వ తేదీ నుంచి లా క్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, లాక్‌డౌన్‌ వి ధించిన మొదట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నా, ఆ తరువాత సద్దుమణి గింది. లాక్‌డౌన్‌ అమలై శనివారం నాటికి నెల రోజులు కావస్తుండగా, కరోన కేసులు కూడా గణనీయంగా తగ్గా యి. ఈ నెల రోజుల్లో కేసుల సంఖ్య ఆరురెట్లు తగ్గింది. 


ఫీవర్‌ సర్వేతో..

కొవిడ్‌-19 పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని కేంద్రాలకు విపరీతంగా జనం వస్తుండడంతో ఏం చే యాలో అర్థం కాని స్థితిలో కేసులు తగ్గించడంతో పాటు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్‌ సర్వేను చే పట్టింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, ముని సిపల్‌, పంచాయతీల సిబ్బంది సంయుక్తంగా ఇంటింటికీ వెళ్లి పరీక్షలు జరిపి జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలుంటే అందుకవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి హోం ఐసోలేషన్‌ చే శారు. దీంతో టెస్టుల కోసం జనం ఎగబడే పరిస్థితి తగ్గి పోయింది. టెస్టుల సంఖ్య కూడా తగ్గింది.


హైరిస్క్‌ వర్గాలకు టీకీకరణ

కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కింద తొలి వి డతలో మునిసి పల్‌ ిసిబ్బంది, వై ద్య, ఆరోగ్య సిబ్బం ది, పోలీసులు, అధికా రులకు టీకాలిచ్చారు. ఆ త ర్వాత ప్రజల నుంచి వచ్చిన డి మాండ్లు, కేంద్రం సూచనల మేరకు హైరిస్క్‌ కేటగిరీలో ఉండే పండ్లు, పూలు, కూర గాయల వ్యాపారులు, పాల విక్రేతలు, పేపర్‌ బాయ్స్‌, మాల్స్‌లలో పని చేసే సిబ్బంది, కిరాణా దుకాణాల నిర్వా హకులు తదితరులకు హైరిస్క్‌ కేటగిరీ కింద వ్యాక్సి నేషన్‌ ఇస్తున్నారు. తాజాగా హైరిస్క్‌ వర్గాల కిందకు వచ్చే మునిసి పాలిటీల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బంది, ఇతర కార్యాలయాల సిబ్బం దికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, ఉమ్మడి జిల్లాలో కరోనా టెస్టులు తగ్గించి, కేసు లు తగ్గాయని ప్రభుత్వం బుకాయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం ఫీవర్‌ సర్వే నిర్వహించ డం ద్వారా లక్షణా లున్న వారిని గుర్తించి వై ద్యం అందించామని చెబుతున్నారు. లక్షణాలు లేకున్నా టెస్టుల కోసం ఎగబడ్డ వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొం టున్నారు. రెండో వేవ్‌ తీవ్రత తగ్గిందని, తాజాగా కేసులు తగ్గడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.


రాష్ట్ర స్థాయి అధికారుల పర్యటన

కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్న సమ యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కేసులు భారీగా పెరగడంతో పాటు మరణాలూ ఎక్కు వగా సంభవించాయి. నిఘా వర్గాల నివేదికలు, హై దరాబాద్‌కు కేసుల రిఫరెన్స్‌లు పెరిగిన దృష్ట్యా ఈ జి ల్లాలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యే కంగా దృష్టి సారించింది. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు జిల్లాను సందర్శించి, కలెక్టర్‌ శర్మన్‌, వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ అ ప్రమత్తం చేసి పలు సూచనలు చేశారు. కొవిడ్‌ లక్షణాలున్న అందరికీ పరీక్షలు చే యించి, అవసరమైన వారకి హోం ఐసోలేషన్‌ ద్వారా చికిత్స అందించారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం, ఫీవర్‌ సర్వే నిర్వహించడం వల్ల లక్షణాలున్న వారిని వెనువెం టనే గుర్తించి, చికిత్స నిర్వహించడం వల్ల ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. అలాగే రాష్ట్రాల సరిహద్దులు కలిగిన జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పరిస్థితిని కూడా రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. ప్రధా నంగా ఏపీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం జిల్లాపై పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చినా, వారిని ఐసోలేషన్‌ చేయడం ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం లేకుం డా చూశారు.


స్వీయ నియంత్రణలో ప్రజలు

మొదటి దశలో విధించిన లాక్‌డౌన్‌కంటే రెండో దశలో విధించిన లాక్‌డౌన్‌లో ప్రజలు చాలా సంయమనం పాటించారు. ఎవరికి వారు అవసరం లేకపోతే వీధుల్లోకి రావద్దనే నియంత్రణ పాటించారు. సడలింపు సమ యంలో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్కులు ధ రించి, భౌతిక దూరం పాటిస్తూ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కృషి చేశారు. పో లీసులు కూడా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు. జిల్లా కేంద్రాలు, ప్ర ధాన పట్టణాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించ డం ద్వారా సిబ్బందిలో అప్రమత్తతని పెంచారు. వాహనాల తనిఖీలు చేప ట్టడం, అనవసరంగా, అనమతుల్లేకుండా రోడ్లపైకి వస్తే జరిమానాలు వి ధించడం వంటి కార్యాచరణతో ప్రజల్లో సైతం జవాబుదారీతనం ఉండేలా చేయగలిగారు. అలాగే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమైన అంతర్రాష్ట్ర ర వాణాని లాక్‌డౌన్‌ సమయంలో ఉమ్మడి జిల్లాలో పోలీసులు కఠినంగా అ మలు చేశారు. ఏపీ, కర్ణాటక సరిహద్దులు కలిగిన జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాలో ఐదు చెక్‌పోస్టుల చొప్పున కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో మొత్తం పది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్క వా హనం, ఒక్క వ్యక్తిని కూడా ఇవతలి వైపు నకు రానీయ లేదు.



Updated Date - 2021-06-12T05:22:41+05:30 IST