కరోనా పాజిటివ్‌.. 1.40 శాతం

ABN , First Publish Date - 2020-12-04T05:34:13+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి వేగం చాలావరకు తగ్గింది.

కరోనా పాజిటివ్‌.. 1.40 శాతం

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి వేగం చాలావరకు తగ్గింది. గురువారం ఉదయం వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అందిన 5,129 శాంపిల్స్‌ ఫలితాల్లో 72(1.40 శాతం) మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. మిగతా 5,057(98.60 శాతం) మందికి నెగెటివ్‌ అని తేలింది.  జిల్లాలో ఇప్పటివరకు  వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,746కి చేరుకోగా వారిలో 73,223(97.96 శాతం) మంది సంపూర్ణంగా కోలుకొన్నారు. 714 మంది చనిపోగా ప్రస్తుతం 809 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా గుంటూరు నగరంలో 17, రేపల్లెలో 8, పెదకాకానిలో 6, వట్టిచెరుకూరులో 4, నరసరావుపేటలో 4, బాపట్లలో 3, చిలకలూరిపేటలో 3, రెంటచింతలలో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవికాక మరో 24 మందికి వైరస్‌ సోకినట్లు  వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-04T05:34:13+05:30 IST