చెన్నైలో తగ్గుతున్న కరోనా బాధితులు, మృతులు

ABN , First Publish Date - 2021-05-18T17:51:46+05:30 IST

చెన్నైలో కరోనా క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తుండడంతో

చెన్నైలో తగ్గుతున్న కరోనా బాధితులు, మృతులు

చెన్నై/పెరంబూర్‌ : చెన్నైలో కరోనా క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తుండడంతో, బాధితులు, మృతుల సంఖ్య తగ్గుతోంది. కానీ, నియంత్రణ చర్యలు, వైద్యపరీక్షలు ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సహకరించిన విధంగా ప్రజలు రాబోయే రోజుల్లో కూడా సహకరిం చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ కరోనా మృతుల సంఖ్య అత్యధికంగా 92గా వుండడంతో, మరింత పెరిగే అవకాశముందని అధి కారులు భావించారు. కానీ, 12వ తేదీ 89 మంది, 13వ తేదీ 88 మంది, 15వ తేదీ 74 మంది, 15వ తేదీ 82 మంది, 16వ తేదీ (ఆదివారం) 60 మంది మృతిచెందారు. ఈ గణాంకాలు నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించాయి. 


అలాగే, కరోనా బాధితుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతోంది. ఈనెల 12న అత్యధికంగా 7,564 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా దిగ్ర్భాంతి చెందారు. అనంతరం 13వ తేదీ 6,991 మందికి, 14న 6,538, 15న 6,640 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే, ఆదివారం (16వ తేది) 6,247 కేసులు నమోదయ్యాయి. కాగా నగరంలో కరోనా బాధితులను యుద్ధప్రాతిపదికన తరలించేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అంబులెన్సులను సిద్ధం చేసింది. వీటిని రోడ్లపైకి దింపింది. ఈ అంబులెన్సులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, లోక్‌సభ సభ్యుడు దయానిధి మారన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌ బేదీ తదితరులు సోమవారం పరిశీలించారు. 

Updated Date - 2021-05-18T17:51:46+05:30 IST