ప్రపంచవ్యాప్తంగా 65 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-04T17:15:48+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 65 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 65 లక్షలు దాటాయి. బ్రెజిల్‌వో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 65,73,540 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,88,041 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 31,70,505 మంది కోలుకున్నారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 19,01,783 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,09,142 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 6,88,670 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,84,562 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 32,568 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 2,66,132 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,87,406 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,128 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,96,015 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 4,32,277 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 5,215 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,95,957 మంది కోలుకున్నారు.


ఇటలీలో కూడా కేసుల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 2,33,836 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 33,601 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,60,938 మంది కోలుకున్నారు. ఫ్రాన్స్‌లోచూస్తే గత 24 గంటల్లో మొత్తం 1,51,677 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 29,021 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 69,455 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,79,856 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 39,728 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,255 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-06-04T17:15:48+05:30 IST