నెలాఖరుకల్లా కనీసం లక్ష కేసులు?.. ప్రభుత్వానికి హెచ్చరిక

ABN , First Publish Date - 2020-06-07T18:37:43+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసి, ఆరోగ్య శాఖకు సూచనలు ఇవ్వడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ వేసింది.

నెలాఖరుకల్లా కనీసం లక్ష కేసులు?.. ప్రభుత్వానికి హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసి, ఆరోగ్య శాఖకు సూచనలు ఇవ్వడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ తాజాగా తమ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం, దేశరాజధానిలో నెలాఖరుకు కనీసం లక్ష కరోనా కేసులు నమోదవుతాయట. ఈ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన కమిటీ.. ఇప్పుడున్న వాటికంటే అదనంగా మరో 15వేల బెడ్లు అందుబాటులో ఉంచాలని సూచించింది.

Updated Date - 2020-06-07T18:37:43+05:30 IST