కామారెడ్డిలో పెరుగుతున్న కేసులు.. పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-08-12T18:13:42+05:30 IST

జిల్లాలో మంగళవారం 105 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 40 పాజిటివ్‌లు వచ్చినట్లు తెలిసింది.

కామారెడ్డిలో పెరుగుతున్న కేసులు.. పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

జిల్లాలో 105 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు



కామారెడ్డి టౌన్‌(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం 105 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 40 పాజిటివ్‌లు వచ్చినట్లు తెలిసింది. ఇందులో జిల్లా కేంద్ర ఆసుపత్రి 11, బాన్సువాడ 2, లింగంపేట 3, ఎర్రాపహాడ్‌ 1, మత్తమాల 2, రాజంపేట 3, నాగిరెడ్డిపేట 2, ఉత్తునూర్‌ 2, భిక్కనూర్‌ 1, దోమకొండ 6, హన్మాజీపేట 1, బీర్కూర్‌ 3, రామారెడ్డి 3 కేసులు నమోదయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పంపిన శాంపిళ్లలో 45, బాన్సువాడ నుంచి పంపినవి 20 పాజిటివ్‌ రాగా, మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉంది.


మెంగారంలో ముగ్గురికి..

లింగంపేట మండలంలోని మెంగారంలో మంగళవారం 17 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సాయికుమార్‌ తెలిపారు. మండల కేంద్రంలో ఇప్పటికే గత వారం రోజులుగా పూర్తి లాక్‌డౌన్‌  అమలు చేస్తున్నట్లు తెలిపారు.


తాడ్వాయిలో ఒకరికి..

తాడ్వాయి మండల కేంద్రంలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదయి నట్లు వైద్యాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు.  


నస్రుల్లాబాద్‌లో ఇద్దరికి..

నస్రుల్లాబాద్‌: మిర్జాపూర్‌లో ఒకరు, నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా వచ్చిందని డాక్టర్‌ రవిరాజా తెలిపారు. 


నాగిరెడ్డిపేటలో ఇద్దరికి..

నాగిరెడ్డిపేట మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు నందిత తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పది మందికి కొవిడ్‌ 19 పరీక్షలు నిర్వహించారు. అందులో మండలంలోని వాడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి, బంజారా గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 


బీర్కూర్‌లో ఒకరికి ..

బీర్కూర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళ వారం ఆరోగ్య సిబ్బంది 15 మందికి ర్యాపిడ్‌ టెస్టులను నిర్వహించారు. ఇందులో 12 నెగిటివ్‌ రాగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. 


భిక్కనూరులో ముగ్గురికి..

భిక్కనూరు, రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి లోని రెండు గ్రామాల్లో ముగ్గురికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారు లు రవీందర్‌, శిరీష్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్ల్లి గ్రామానికి చెంది న ఒక్కరికి, జంగంపల్ల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి పాజటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపారు. 


పల్లెల్లో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ ప్రభావం దృష్ట్యా గ్రామాలు, పల్లెల్లో స్వచ్ఛం దంగా లాక్‌డౌన్‌ కొనసాగించేందుకు తీర్మానాలు చేశారు. మండలంలోని బోర్లం, దేశాయిపేట్‌, ఇబ్రహీంపేట్‌, రాంపూర్‌తండా, హన్మాజీపేట్‌ తదితర గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. గ్రామాల్లో ఉదయం నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర, తది తర దుకాణాలను కొనసాగిస్తున్నారు. మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామ ంలో సర్పంచ్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గ్రామం లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఇతరులు ఎవరూ రాకుండా గ్రామం చుట్టూ కర్రలతో కట్టి, వ్యక్తులు ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-12T18:13:42+05:30 IST